BREAKING
రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ గ్లింప్స్ అప్‌డేట్.. విడుదల తేదీ ఖరారు! జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే! పర్యావరణ పరి రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ, పాదయాత్ర సన్నాహాక సమావేశం. ఈటల పాదయాత్ర.

మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Select Suryaa Now
మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
బంట్వారం, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బొప్నారం గ్రామ శివారులోని మణికంఠ మైన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. మైనింగ్ తవ్వకాలతో ఏర్పడిన నీటిగుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. కర్ణాటక రాష్ట్రం కుంచవరం గ్రామానికి చెందిన సురేందర్ (14), తొమ్మిదో తరగతి, అజయ్ కుమార్ (13), ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. చిన్న వయసులోనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనతో బొప్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.విద్యార్థుల మృతితో శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు మణికంఠ మైన్స్ వద్ద మృతదేహాలతో ఆందోళనకు దిగారు. మైన్స్ యాజమాన్యం ఘటనాస్థలానికి వచ్చి తమకు సమాధానం చెప్పిన తర్వాతే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు గ్రామస్తులు మద్దతుగా నిలవడంతో ఘటనాస్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.సమాచారం అందుకున్న సీఐ రఘు రామ్, ఎస్సై పుండ్లిక్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మైన్స్ యాజమాన్యం స్పందించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు పట్టుబట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.మైనింగ్ తవ్వకాలతో ఏర్పడిన లోతైన గుంతల్లో నీరు నిల్వ ఉండటం, వాటి వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మణికంఠ మైన్స్‌లో భద్రతా నిబంధనలు పాటించారా? ప్రమాదకరమైన గుంతల చుట్టూ రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చి, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.