BREAKING
జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే! పర్యావరణ పరి రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ, పాదయాత్ర సన్నాహాక సమావేశం. ఈటల పాదయాత్ర. ఆదర్శ కుటుంబం మూవీ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న భావోద్వేగాల ప్రయాణం

బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్.

Select Suryaa Now
బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్.

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున భార్యాభర్తలు ఎన్నికల బరిలో నిలిచారు. మండల జడ్పీటీసీ అభ్యర్థిగా గొల్ల సన్నప్ప, ఎంపీటీసీ అభ్యర్థిగా ఆయన భార్య గొల్ల పద్మావతి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా గొల్ల సన్నప్ప, నాగప్ప కుమారుడిగా నామినేషన్ సమర్పించగా, ఆయన భార్య గొల్ల పద్మావతి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆశీస్సులతో పాటు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. బ్రహ్మసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమకు సహకరించాలని గొల్ల సన్నప్ప కోరారు. జడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల పద్మావతి కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. నామినేషన్ల దాఖలుతో బ్రహ్మసముద్రం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. రానున్న రోజుల్లో అభ్యర్థుల ప్రచారం, ఓటర్ల మద్దతు సమీకరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-బోయ రంగస్వామి