శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో అక్రమాలు, వైయస్సార్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వెయ్యకుండా దౌర్జన్యాలు - తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం.
శ్రీకాళహస్తి ప్రాంతంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యాలపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అధికార పక్షం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు.
గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ప్రజాస్వామ్యం కనబడలేదని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి
పోలీసులు నీడలో అధికార పక్షం అరాచకాలు చేయడం జరిగిందని తెలిపారు.
ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర విధ్వంసకాండను సృష్టించారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడు తున్నామనే నెపంతో పోలీసులే పహారా కాస్తూ వైయస్సార్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు . వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మహాభారతాన్ని తలపించేలా నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళలు చీరలు లాగడం, వాహనాలను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా కొట్టడం వంటి దౌర్జన్యాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇటువంటి హింసాత్మక సంస్కృతి వల్ల కార్యకర్తలపై కేసులు నమోదై వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, ఇటువంటి చర్యలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలపై
ఎస్ ఈసీ, కోర్టులను ఆశ్రయిస్తాం అని తెలిపారు.
తమ నాయకులు, అభ్యర్థులపై జరిగిన అఘాయిత్యాలు, అవమానాలపై తగిన ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అన్ని మండలాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేలా ఎస్‌ఈసీ తగిన అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఈసీ నుంచి న్యాయం జరగని పక్షంలో కోర్టును ఆశ్రయించి, నామినేషన్లు వేయలేకపోయిన స్థానాల్లో తిరిగి నామినేషన్లు వేసేలా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, ఆయన కుమార్తె, కుమారుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కక్షపూరిత రాజకీయంలో భాగమేనని దుయ్యబట్టారు. ఈ అరాచకాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చి తన హుందాతనాన్ని నిరూపించు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలకు
బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు.
ఎన్నికల దాడిలో నష్టపోయిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు తానే స్వయంగా ఆర్థికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. లాఠీ దెబ్బలకు సైతం భయపడకుండా పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు కూడా తమ పార్టీ శ్రేణులు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయని, ఎవరూ తగ్గేదే లేదని సవాల్ విసిరారు.
దమ్ముంటే నేరుగా తేల్చుకుందాం అని బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా నాతోనే వైరం పెట్టుకోవాలి. నా పిల్లలపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గులేని చర్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎక్కడికి రమ్మన్నా వచ్చి తన బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా బహిరంగ సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి* 9644411197