BREAKING
బోసిపోయిన నామినేషన్ కేంద్రాలు రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ గ్లింప్స్ అప్‌డేట్.. విడుదల తేదీ ఖరారు! జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే!

పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం

Select Suryaa Now
పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవిద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పీఎం శ్రీ గౌతమి మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు డి.శ్రీనివాస్ తెలిపారు.జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో వొకేషనల్ విద్యలో భాగంగా మండపేట పీఎం శ్రీ గౌతమి మున్సిపల్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవుల్లో పది రోజులపాటు ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు.ప్రధానోపాధ్యాయుడు డి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆటోమోటివ్ ట్రేడ్‌కు సంబంధించి స్థానికంగా ఎంపిక చేసిన ఆటోమొబైల్ వర్క్‌షాపులు, ఫోర్ వీలర్ రిపేరింగ్ షాపుల్లో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమొబైల్ వర్క్‌షాపుల్లో పనిచేసే విధానం, కార్ల విడిభాగాలు, ఇంజిన్ పనితీరు, మరమ్మతుల ప్రక్రియతో పాటు పని ప్రదేశాల్లో పాటించాల్సిన భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తరగతి గదుల్లో నేర్చుకున్న పుస్తక జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అన్వయించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.వొకేషనల్ ట్రైనర్ వై.ఎస్.రాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వృత్తి విద్యపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను అలవర్చుకుంటే ఉద్యోగ అవకాశాల్లో ముందంజలో నిలవవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు.