BREAKING
బోసిపోయిన నామినేషన్ కేంద్రాలు రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ గ్లింప్స్ అప్‌డేట్.. విడుదల తేదీ ఖరారు! జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే!

మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి

Select Suryaa Now
మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి :  ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి

కొంపల్లి మేజర్ న్యూస్  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎస్సార్ నాయక్ నగర్‌లో గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న ఇండోర్ స్టేడియాన్ని వెంటనే పునఃప్రారంభించాలని సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

స్టేడియం మూతపడటంతో స్థానిక యువత, క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. క్రీడల కోసం నిర్మించిన స్టేడియం నిరుపయోగంగా ఉండటంతో యువతకు నష్టం జరుగుతోందని, పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వినియోగం వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సార్ నాయక్ నగర్‌తో పాటు అపురూప కాలనీ, జనప్రియ అపార్ట్‌మెంట్స్, మోడీ బిల్డర్స్, ప్లేయర్స్ కాలనీ ప్రాంతాల ప్రజలు స్టేడియం తిరిగి ప్రారంభం కావాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకునేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వినతిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి స్టేడియాన్ని తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ నాయక్ నగర్ మాజీ జనరల్ సెక్రటరీ వెంకట శ్యామ్, సోమేశ్వరరావు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.