సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓటర్లలో భరోసా కల్పించేందుకు మండపేట రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ద్వారపూడి, జెడ్. మేడపాడు గ్రామాల్లో రూరల్ ఎస్‌ఐ వి. కిషోర్‌తో కలిసి సీఐ పి. దొరరాజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దశలవారీగా అన్ని సమస్యాత్మక గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ దొరరాజు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ఓటర్లు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు.