BREAKING
రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ గ్లింప్స్ అప్‌డేట్.. విడుదల తేదీ ఖరారు! జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే! పర్యావరణ పరి రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ, పాదయాత్ర సన్నాహాక సమావేశం. ఈటల పాదయాత్ర.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

Select Suryaa Now
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

సోమాజిగూడ /మేజర్ న్యూస్ :హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా హియ్య వారి 6 వ బ్రాంచ్ ను హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని కోంపల్లిలో గ్రాండ్ లాంచ్ ఐయింది. కపుల్స్, పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే థీమ్, అద్భుతమైన రుచి దీని ప్రత్యేకత. అంతేకాదు మండి అంటే నాన్ వెజ్ మాత్రమే కాదు, ఇక్కడ వెజ్ కూడా అంతే ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఆహ్వానించిన గౌతమి చౌదరికి ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ లో ఇంత క్రియేటివ్ థీమ్ తో హియ్యా స్పేస్ మండిని ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ మిక్స్ అవ్వకుండా ఫుడ్ ని తయారు చేస్తారని తెలిపారు. మసాలాలు కూడా సపరేట్ గా తయారు చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఒక్కసారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడరని, చాలా శుభ్రంగా కిచెన్ ను చూసుకుంటారని వెల్లడించారు. శాకాహారులు నిస్సందేహంగా ఇక్కడ రుచులను ఆస్వాదించొచ్చని తెలిపారు. ఇలాంటి థీమ్ తో కొంపల్లిలో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం బాగుంది అన్నారు. తన అభిమానులు కచ్చితంగా విజిట్ చేయాల్సిందే అన్నారు. అలాగే ఫ్యామిలీస్ కూడా వీకెండ్స్ లో వచ్చి హియ్యా స్పేస్ మండి వాళ్ళ రుచులను చూడాలని కోరారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ.. హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కొంపల్లి లో 6 వ బ్రాంచ్ గా హియ్య స్పేస్ మండి ప్రారంభం అవడం, అదీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మల్టిపుల్ థీమ్స్ తో వస్తున్న మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఫారెస్ట్ థీమ్, డైనోసార్ థీమ్ చూసాము. ఇటీవల అమీర్ పేట్ లో కొత్తగా స్పేస్ థీమ్ ను లాంచ్ చేశాము. ఇప్పుడు కోంపల్లిలో రెండవ బ్రాంచిగా ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.

కొత్త థీమ్ తో రావడం మాత్రమే కాదు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న ధరలలో మా రుచులను అందించడం మా ప్రత్యేకత అని పేర్కొన్నారు. అలాగే వెజ్, నాన్ వెజ్ ఎప్పుడు సపరేట్ గా వండుతామని.. కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలతో మేము రావడంతో.. మరికొంతమంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. దానివలన సిటీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఓనర్స్ జశ్వంత్, లోకేష్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే దిల్సుఖ్ నగర్ మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందని తెలిపారు. అన్ని బ్రాంచ్ లను ఆదరించినట్టుగానే కొంపల్లిలో ఉన్న బ్రాంచ్ ను ఆదరిస్తారని కోరారు.