BREAKING
ఆసియన్ పారా గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో అద్భుత రికార్డు పట్టభద్రుల ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం - ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి మీ ఓటుతో ఆశీర్వదించండి.. టిడిపి 21 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ వాసవి అమ్మవారి ఊరేగింపు మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం: శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపిన బావోజు సిద్దేశ్వర చారి! జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాల్సిందే మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రత్తిపాడు : తలెత్తుకు నిలబడ్డ పారిశుధ్య వాహనం కే గంగవరం ఎంపీపీ రేస్ లో అభ్యర్థులు వీరే బషీరాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ కదలికలు.. ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణరావుతో భేటీ హెరిటేజ్ ఫుడ్స్‌లో లివో యోగర్ట్ వ్యాపార విలీనం విలువ ఆధారిత పాల ఉత్పత్తుల విస్తరణకు కీలక అడుగు టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి బీజేపీ వినతిపత్రం 30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి సమీర్ ఖాన్ ఇంటింటా ప్రచారం ముదిరాజ్ లను బీసీ(ఏ ) లో చేర్చవద్దు .. త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక పాత్ర 2047 నాటికి ఆధునిక రక్షణ వ్యవస్థే లక్ష్యం: నితిన్ ఎ. గోఖలే

మానేరు వాగులో మునిగి యువకుడు మృతి

Select Suryaa Now
మానేరు వాగులో మునిగి యువకుడు మృతి
సూర్య, ముత్తారం ముత్తారం మండలం ఓడేడు గ్రామ శివారులోని మానేరు నది వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగి రత్నాపూర్ గ్రామానికి చెందిన శానిగరపు జయపాల్ (32) మృతి చెందినట్లు ఎస్ ఐ ఎన్.రవికుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో జయపాల్ తన భార్య శ్రుతి, కుమార్తెతో కలిసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మానేరు నది వద్ద ఆగారు. ఈ క్రమంలో జయపాల్ నీటిలోకి దిగడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన భార్య శ్రుతి కూడా నీటిలో మునిగిపోతుండగా, అక్కడే ఉన్న ఈశ్వర్ వారిని బయటకు తీశాడు. అయితే అప్పటికే జయపాల్ మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న శ్రుతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.