BREAKING
అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే?

సైదాపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత!

Select Suryaa Now
సైదాపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత!

కొండాపూర్‌;కొండాపూర్‌ మండల పరిధిలోని సైదాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 44 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపడం వల్ల తమ పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులను కేటాయించాలని వినతి గ్రామ సర్పంచ్‌ రాధికా రామగౌడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపితే విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే ఆందోళన చేపడతామని తెలిపారు.స్ట్రెంత్‌ ప్రకారమే డిప్యూటేషన్లు: ఎంఈవో సైదాపూర్‌ పాఠశాలలో గతంలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారని, గత ఏడాది తెలుగు ఉపాధ్యాయుడిని, ఈ ఏడాది హిందీ ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపినట్లు మండల విద్యాధికారి ఎలిజబెత్‌ తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. ఆరు, ఏడో తరగతుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా, సుమారు 10 నుంచి 12 మంది మాత్రమే ఉండటంతో విద్యార్థుల సంఖ్య, పాఠశాల స్ట్రెంత్‌ ఆధారంగానే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపినట్లు పేర్కొన్నారు.చదువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.ఉపాధ్యాయుల కేటాయింపుపై అధికారులు నిబంధనలను ప్రస్తావిస్తుండగా, తమ పిల్లలకు బోధనలో ఇబ్బందులు కలగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలోని అన్ని తరగతులకు సరిపడా బోధన అందేలా అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.