BREAKING
అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు సామాజిక సేవలతోనే గుర్తింపు..-ఎస్సై తోట తిరుపతి సీఎస్‌పురం జడ్పీటీసీగా కోటపాటి నామినేషన్

ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు

Select Suryaa Now
ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు

పిఎం పాలెం, సూర్య : మీరు చూపించే అభిమానానికి తప్పకుండా ఋణపడి ఉంటా ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఇంట్లో బంధువులగా సేవ చేసుకుంటానని పదో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గరే జ్యోతి పేర్కొన్నారు.భీమిలి నియోజకవర్గం పరిధి జివిఎంసి 10వ వార్డు టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ సతీమణి గరే జ్యోతి శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం పిఎం పాలెం ఆర్ హెచ్ కొలనీ లో అశేష జనసందోహం నడుమ ఘనంగా చేపట్టారు.ముందుగా పిఎం పాలెం ఆర్ హెచ్ కొలనీలో ఉన్న నూకంభికా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.అడుగడుగునా  కార్పొరేటర్ కూటమి అభ్యర్థి గరే జ్యోతికి ప్రజలు హరాతులతో ఘనంగా స్వాగతం పలికారు.తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో 10 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గరే జ్యోతిను మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముక్క శ్రావణి నీలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

ఆర్ హెచ్ కొలనీ లో అడుగడుగునా జననీరాజనం.....

ఆర్ హెచ్ కాలనీలో చేపట్టిన జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో కాలనీలో ప్రజలకు తమకిష్టమైన కూటమి అభ్యర్థి ప్రచారంలో కాలనీ ప్రజలందరూ ఏకమై వారి అభిమానాన్ని వెల్లువలా చాటారు. అడుగడుగునా పూల వర్షం కురిపించి ప్రతి ఇంటా ఆడపడుచులు హారతులు పట్టి గరే జ్యోతి కి ఘన స్వాగతం పలికారు.ప్రజలు చూపించిన అభిమానానికి ఆమె తప్పకుండా రుణపడి ఉంటానని ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఇంట్లో బంధువులగా సేవ చేసుకుంటానని గరే జ్యోతి పేర్కొన్నారు. ఆర్ హెచ్ కాలనీలో ప్రతి సమస్యను ప్రజల వద్ద తెలుసుకున్నాను అని వాటి పరిష్కారం కొరకు అనునిత్యం పాటుపడతానని ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు.జరగబోయే జీవీఎంసీ ఎన్నికలలో 10 వ వార్డులో కూటమి పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆమెను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.వార్డులో స్థానికంగా ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. అధిష్టానం,స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహాకారంతో ఆమె భర్త గురునాథ్ సహాయంతో వార్డును మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె తెలిపారు.ఈ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, పి. ఎం. పాలెం, విశాఖపట్నం.