సీఎస్‌పురం జడ్పీటీసీగా కోటపాటి నామినేషన్
- పాల్గొన్న దారపనేని, బైరెడ్డి, గుర్రం
పామూరు, మేజర్ న్యూస్ : సీఎస్‌పురం మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా కోటపాటి జనార్దన్‌రావు శుక్రవారం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. కోటపాటి నామినేషన్ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి, మోపాడు టీడీపీ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పీసీపల్లి మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య, తలకొండపాడు వెంకటేశ్వర్లు, కనిగిరి ఏఎంసీ వైస్‌చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, కనిగిరి కూటమి జడ్పీటీసీ అభ్యర్థి దంతులూరి ప్రకాశం, బైరెడ్డి జస్వంత్‌రెడ్డి, గళ్ల చెన్నయ్య, పోలు సుధాకర్‌రెడ్డి, మేడసాని రమణయ్య, తిరుపతిరావు, తిరివీధి చంద్ర, కోటపాటి వెంకటేశ్వర్లు, యరశింగరాయుడు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.