మూడు రోజుల్లో 66 నామినేషన్లు
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు మూడు రోజులపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 66 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. తొలిరోజు 22, రెండో రోజు 25, చివరి రోజు 20 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. చివరి రోజు టీడీపీ తరఫున 11, వైసీపీ తరఫున 6, జనసేన తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. పరిశీలనలో తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26న అప్పీళ్లను పరిశీలించి ఆర్డీవో ఇచ్చే ఆదేశాలను పాటించడం జరుగుతుందని చెప్పారు. 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి, పోటీలో నిలిచే అభ్యర్థులకు ఫారం-9తో పాటు ఎన్నికల గుర్తులను కేటాయించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు.