BREAKING
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు దర్శి నియోజకవర్గంలోప్రశాంతంగా ముగిసిన నామినేషన్ లు. అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర

Select Suryaa Now
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును తరలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 25న అన్ని వర్గాల ప్రజలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు, 27వ తేదీ నుంచి బాధిత ప్రజలకు మద్దతుగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపును డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, దమ్మాయిగూడ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ప్రతినిధుల సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నీటి కారణంగా చెరువులు కలుషితమవుతున్నాయని, స్థానిక ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు సహా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.డంపింగ్ యార్డ్ నుంచి మీథేన్ వాయువు విడుదల కావడం పర్యావరణానికి ప్రమాదకరమని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా చర్యల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్ నగర్ ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈటల స్పష్టం చేశారు. ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని, 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే జవహర్ నగర్‌లో సకల జనుల సమ్మె చేపడతామని హెచ్చరించారు. చెత్తను శాశ్వతంగా నిర్మూలించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు, సాంకేతిక సహాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ ప్రజల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ చేపట్టనున్న పోరాటానికి బీజేపీ శ్రేణులన్నీ సంపూర్ణ మద్దతు ఇస్తాయని ప్రకటించారు.సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్ది మోహన్ రెడ్డి, డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ నాయకుడు సుదర్శన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ గండే, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు, జేఏసీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.