BREAKING
కవిత్వమే జీవన శ్వాసగా పెండ్యాల ఆంజనేయులు: ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు దర్శి నియోజకవర్గంలోప్రశాంతంగా ముగిసిన నామినేషన్ లు. అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు

- నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం -

Select Suryaa Now
- నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల   - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం   -

 

-

ధర్మవరంరూరల్ 

 

  సత్యసాయిజిల్లాలో ఈసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నిక ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఉమ్మడి అనంత జిల్లాలో నల్లచెరువు మండలం ప్రతి నోట వినిపిస్తుండటమే. అందుకు కారణం  పరిటాల అనే బ్రాండ్ కదిరి నియోజకవర్గం లోని నల్లచెరువు మండలానికి చేరడమే. టిడిపి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పరిటాల శ్రీరామ్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కదిరి నియోజకవర్గం లోని నల్లచెరువు మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేయడమే. ఈయన తన కుటుంబ ఆప్తమిత్రుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మరో మిత్రుడు సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు ఎమ్మెస్ రాజు తో కలిసి చివరి రోజైన శుక్రవారం జడ్పిటిసిగా నామినేషన్ దాఖలు చేశారు. పరిటాల శ్రీరామ్ నల్లచెరువుకు పోటీ చేయాలని ఆదేశాలు అందాయే లేదో అప్పటికే ఆ మండలము యొక్క పేరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. 

కలిసొస్తున్న  పరిటాల బ్రాండ్, కందికుంట క్రేజ్.…

కదిరి నియోజకవర్గంలో పరిటాల బ్రాండ్, కందికుంట క్రేజ్ తోడు కావడంతో అది ఒక మహా బ్రాండ్ గా నిలుస్తోంది. ఇప్పుడు నల్లచెరువు మండలం ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో హోరెత్తిస్తోంది. అందుకు కారణం కందికుంట ఆరాధ్య దైవంగా భావించే పరిటాల రవి తనయ పరిటాల శ్రీరామ్ నల్ల చెరువు మండలం నుంచి జెడ్పిటిసిగా బరిలో దిగడమే. ఈ నల్లచెరువు మండలం కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కదిరి నియోజకవర్గంలో ఉండడమే. 

క్యాడర్లో ఉరకలేస్తున్న ఉత్సాహం.…

ఎప్పుడైతే టిడిపి అధిష్టానం పరిటాల శ్రీరామ్ ను జడ్పి ఎన్నికల బరిలో నిలవాలని ఆదేశించింది. దీంతో తమ కుటుంబ ఆప్త మిత్రుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తో సంప్రదించి నల్లచెరువు జెడ్పిటిసిగా బరిలో నిలిచేలా నిర్ణయం తీసుకున్నారు. నల్లచెరువు బరిలో జడ్పిటిసిగా పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని తెలియగానే కదిరి నియోజకవర్గం లోని టిడిపి క్యాడర్లో సంబరాలు జరుపుకున్నారు. పరిటాల బ్రాండ్ కందికుంట క్రేజ్ ఏకమై అదొక మహా బ్రాండ్ గా నిలవనుందని శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు కుటుంబాలు రాజకీయంగా ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందన్న నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.