BREAKING
కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి.

మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి

Select Suryaa Now
 మాజీ కార్పొరేటర్  అభ్యర్థి భర్తపై దాడి

ఆరిలోవ, సూర్య  : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత అరిలోవ దుర్గాలమ్మ గుడి సమీపంలో గురువారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 14వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న రెడ్డి కిరణ్మయి భర్త లావేటి దాసు (35)పై దాడి చేసి, కారును ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన లావేటి దాసు గురువారం రాత్రి తన స్నేహితుడి కారులో (AP 39 KF 6524) పాత అరిలోవ దుర్గాలమ్మ గుడి వైపు వెళ్తుండగా, రాత్రి 10.50 గంటల సమయంలో ఈగల జగదీష్ (31), నక్కాన ఎర్రాజి (33) కర్రలతో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు అద్దం ధ్వంసమవగా, దాసు చెవి వెనుక భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. కిరణ్మయి 14వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం ఉపసంహరించుకోవడంతో ఇరువర్గాల మధ్య పాత కక్షలు ఏర్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఘటన జరిగిన సమయంలో ఆరిలోవ సీఐ ఎస్. శ్రీనివాస్, ఎస్సై వై. కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు క్రైమ్ నంబర్ 304/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.పోలీసుల అప్రమత్తతపై ఉన్నతాధికారుల అభినందనలు,సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్న ఆరిలోవ సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బందిని విశాఖ నగర పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీలు అభినందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.