BREAKING
*కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా... *ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు తె ర్లాం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా ఎన్ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు హడలెత్తిస్తున్న గ్రామసింహాలు - భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి... గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు బీజేపీ పాదయాత్ర.. రేపు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే సహకారంతో ఐదు లక్షల ఎల్ ఓ సి చెక్కు అందజేత ఇండిపెండెంట్ 48వ వార్డు అభ్యర్థిగా కోయిలాడ నవ్య ఎన్నికల ప్రచారం

నామినేషన్ కేంద్రం దెగ్గర గుంపులు గుంపులుగా ఉండడం నిషేధం.. జగ్గయ్యపేట సీఐ...

Select Suryaa Now
నామినేషన్ కేంద్రం దెగ్గర గుంపులు గుంపులుగా ఉండడం నిషేధం.. జగ్గయ్యపేట సీఐ...

*నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు నిషిద్ధం : సీఐ వెంకటేశ్వర్లు*

      స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కఠిన పోలీసు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా గుమిగూడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆయన చెప్పారు. సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ చట్టం 30 అమలులో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరిని (1+2) మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయాన్ని ముందుగానే పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘన.. ప్రక్రియకు ఆటంకం కలిగించినా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సర్కిల్ పరిధిలోని నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

 

 

 

 

రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట