BREAKING
వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ ‘నా వైఫ్ మిస్సింగ్’ మూవీ రివ్యూ.. ఆహా ఓటీటీలో సినిమా ఎలా ఉందంటే? ఎన్నికల జోరు పెంచిన వైసీపీ 49 వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ.. కోట్ల ఉద్యోగాన్ని వదిలేసి.. రజనీకాంత్ చిత్రంలో అదరగొట్టిన నటుడు నమో నారాయణ సక్సెస్ జర్నీ విద్యార్థులకు బడిలో నీటి కష్టాలు! కేతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేయని నీటి వసతి.. భోజనం తర్వాత ప్లేట్లతో బయటకు వెళ్తున్న పిల్లలు దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎం.పీ.టీ.సీ. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు కృష్ణపట్నం బిట్-1 ఎంపిటిసి స్థానానికి తొండమనాటి..... నామినేషన్.

పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి..

Select Suryaa Now
పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి..


#.రైతులకు తక్షణ పరిహారం అందించాలి.. #.ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి..
#.డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..          #.బీజేపీ విధానాలపై బీవీ రాఘవులు విమర్శలు..
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల దుస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకుని వారికి తగిన సహాయం అందించాలని కోరారు. నల్లగొండ నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నల్లగొండ మండలంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని బి.వి. రాఘవులు తెలిపారు. రైతులు పంటల సాగు కోసం పెట్టిన ప్రతి పైసా కోల్పోయి, పూర్తిగా సర్వస్వం కోల్పోయే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారి పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటాను సైతం తగ్గించిందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం దేశంలో జాతీయ సమైక్యతకు బీజేపీ ప్రభుత్వమే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తోందని విమర్శించారు.దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం లౌకిక శక్తులన్నీ ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.ఢిల్లీలో విజయదశమి సందర్భంగా రావణాసురుడి బొమ్మతో పాటు బొద్దింక బొమ్మను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని రాఘవులు ప్రస్తావించారు. దేశ సమైక్యత గురించి మాట్లాడుతూనే, దేశ ఐక్యతను దెబ్బతీసే విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. దేశ సమైక్యతను కాపాడాలంటే ప్రజలను విభజించే విధానాలను విడనాడాలని పేర్కొన్నారు.డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని బి.వి. రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంటు స్థానాలను కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇష్టానుసారంగా, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్ చేపట్టడం వల్ల దేశ సమైక్యత సాధ్యం కాదని పేర్కొన్నారు. బీజేపీ తన రాజకీయ మెజారిటీని పెంచుకోవాలనే లక్ష్యంతో డీలిమిటేషన్‌ను ఉపయోగించుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆత్మనిర్భరత లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. విదేశీ పెట్టుబడులకు 51 శాతం వాటా కల్పించడం, బ్యాంకులను విదేశీపరం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించినప్పటికీ దేశం తన కాళ్లపై తాను నిలబడాలని చెప్పడం మాత్రమే సరిపోదని, ఆ దిశగా ఆర్థిక విధానాలను రూపొందించి అమలు చేయాలని అన్నారు. ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధానాలు పాలనలో కొనసాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల మంది ఓటర్లను తొలగించారని బి.వి. రాఘవులు పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడం ద్వారా దేశ సమైక్యతను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలని అన్నారు. గతంలో మాదిరిగా సమగ్ర వివరాలను సేకరించి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జనాభా లెక్కల ప్రక్రియను నిర్వహించాలని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.