BREAKING
బస్సు, లారీ మధ్య ఇరుక్కున్న ఆటో.. తృటిలో తప్పిన పెను ప్రమాదం *వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు* కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన న్యూజిలాండ్

గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి

Select Suryaa Now
గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ ఎన్నికల్లో భాగముగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గరుగుబిల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా తెర్లి ఎల్లం నాయుడు గురువారం నామి నేషన్ దాఖలు చేశారు.పెద్దూరు గ్రామము నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలుతోపాటు గరుగుబిల్లి గ్రామంలో తమ అనుచరు లతో ర్యాలీగా మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయం వరకు నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. అనంతరం ఎన్నికల నిబంధన మేరకు తమ అనుచరులతో ఎంపీటీసీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తెర్లి ఎల్లము నాయుడు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఎం వాణిశైలజకు సమర్పించారు. అదే విధంగా రావుపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా దాసరి పార్వతి నామినేషన్ దాఖలు చేశారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశెట్టి ఇందుమతి, రౌతు రామి నాయుడు, తుమ్మగుంట శ్రీరాములు నాయుడు,చందక వెంకటేష్, మర్రాపు శ్రీనివాసరావు,బొబ్బిలి వెంకట దామోదరరావు,గంట సింహాచలం నాయుడు, మర్రాపు కృష్ణ, గొంగాడ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా పలువురు ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల ను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈనామినేషన్ ల స్వీకరణ కార్యక్రమం లో ఉప ఎన్నికల అధికారులు నడిమింటి సూర్యనారాయణ, పాము బాల, ఏవో నాలి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.