telangana
ఘనంగా పండుగ సాయన్న జయంతి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: చౌదరిగూడలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో పండుగ సాయన్న జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పసులాది నర్సింగ్ రావు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వెంకటాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ నీరుడు కుమార్ ముదిరాజ్ హాజరై సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీరుడు కుమార్ మాట్లాడుతూ పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని, సమాజం కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సాయన్న ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు పులికంటి భాస్కర్ రెడ్డి, నీరుడి రామారావు ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ లు కుర్ర మహేందర్ గౌడ్, కందుల రాజు ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు మాన్యం, సుధాకర్, ముదిరాజ్ సంఘ సభ్యులు నర్సింగ్ రావు, మల్లేష్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.