కపిలేశ్వరపురం జడ్పిటిసి జనసేన అభ్యర్థిగా మీనా కుమార్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం కూటమి పొత్తులో భాగంగా కపిలేశ్వరపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున వల్లూరు మాజీ సర్పంచ్ దాసి మీనాకుమారిని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణ కు ఈమె ముఖ్య అనుచరులు గా పేరొందారు. ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన ఈమె లీలా కృష్ణ స్వంత గ్రామం వల్లూరు లో లీలా ఆశీస్సులు తో సర్పంచ్ గా పనిచేశారు.ఈ నేపథ్యంలో కపిలేశ్వరపురం మండలంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మీనాకుమారి విజయానికి కృషి చేయాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావులేకుండా ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. కూటమి ఐక్యతను చాటేలా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.