BREAKING
వత్సవాయి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాటేపల్లి రవి నామినేషన్ దాఖలు *లింగాయత్ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* వార్డు కార్యాలయాలను ప్రారంభించిన నాగూర్ మీరాన్ వత్సవాయి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా వడ్లమూడి రాంబాబు నామినేషన్ *సెట్విన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సంగన్న పాటిల్, సర్పంచ్ విద్యాసాగర్* ఆత్రేయపురం మండలం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థిగా కప్పల శ్రీధర్ నామినేషన్ రాయలసీమ గడ్డపై ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. వేదిక, సమయం ఖరారు 29 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు పేరవరంలో వైసీపీని వీడి టిడిపిలో చేరికలు దర్శి లో 18 నామినేషన్ దాఖలు. ఆత్రేయపురం మండలంలో 44 నామినేషన్లు *ఘనంగా పండుగ తెలంగాణ రాబిన్ హుడ్ జయంతి వేడుకలు* రామాయణ సినిమా టికెట్ ధరలపై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకే పెద్ద పీట కపిలేశ్వరపురం జడ్పిటిసి జనసేన అభ్యర్థిగా మీనా కుమార్

'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు'

Select Suryaa Now
'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు'

సీతమ్మధార, సూర్య : రుషికొండ తీరంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై ‘విహాంగ్ అడ్వెంచర్స్’ ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ఈ ఘటనను కొందరు 'పెను ప్రమాదo'గా పేర్కొనడం వాస్తవ విరుద్ధమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తను కొట్టిపారేసింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహకాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారని నిర్వాహకులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. పారాగ్లైడర్ ల్యాండ్ అవుతున్న సమయంలో అందులో ఉన్న ప్రయాణికురాలి చేయి అనుకోకుండా మాస్టర్ స్విచ్‌కు తగలడంతో ఇంజిన్ ఆగిపోయిందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, అనుకోని పరిణామoగా గుర్తించాలన్నారు. గాల్లో ఇంజిన్ ఆగినప్పటికీ, అనుభవజ్ఞుడైన పైలట్ ఏమాత్రం తడబడకుండా అత్యవసర ల్యాండింగ్ నిబంధనల్ని పాటించి, గ్లైడర్‌ను పూర్తి నియంత్రణలో ఉంచుతూ సురక్షితంగా నేలపైకి దించారన్నారు. అనంతరం గ్రౌండ్ సిబ్బంది ఆ ప్రయాణికురాలికి ప్రాథమిక సహాయo త్ అందించారన్నారు. 
భద్రతకే తొలి ప్రాధాన్యత
గ్లైడర్ సాంకేతికతపై అన్ని టెస్టులూ నిర్వహించామని, ప్రయాణికుల ​భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని విహాంగ్ అడ్వెంచర్స్ నిర్వహకులు స్పష్టం చేశారు. అన్ని నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తున్నామని, వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోకుండా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ప్రచారం చేయొద్దని సంస్థ ప్రతినిధులు ఆ ప్రకటనలో సోషల్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.