వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత..
వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత..
ఆదోని రూరల్. సూర్య ప్రతినిధి ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా ఆదోని మండలంలో ఉద్రిక్తత నెలకొంది. దిబ్బనకల్లు, విరుపాపురం గ్రామాలకు చెందిన వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు లాక్కొని చించివేసి, కాలువలో పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ వర్గాలు కోరాయి.
రామాంజనేయులు ఆదోని రూరల్ సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా