*వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు*
రాయికోడ్; మండల కేంద్రమైన రాయికోడ్ లోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం నాడు రైతులకు పారదర్శకమైన మార్కెటింగ్ సేవలు అందించడం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిబంధనలను అమలు చేయడం, వ్యాపారులు చట్టబద్ధంగా లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించడం లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ గారి అధ్యక్షతనడీలర్లకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.*కార్యక్రమంలో చర్చించిన అంశాలు*ఈ సందర్భంగా డి ఎం ఓ శ్రీకాంత్ మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలో వర్తించే నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ పొందడం, సంబంధిత ఫీజులు మరియు వర్తించే సెస్సును నిర్ణీత విధానంలో చెల్లించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. వ్యాపారులు లైసెన్సుల మంజూరు, పునరుద్ధరణకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ, అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ నిబంధనల అమలు ద్వారా వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు న్యాయమైన వాణిజ్య వాతావరణం కల్పించవచ్చని వివరించారు. మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ "మార్కెటింగ్ శాఖకు సంబంధించిన విధివిధానాలు, ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియ, సెస్సు చెల్లింపుల ప్రాముఖ్యత, వ్యాపారులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి వివరించారు. మార్కెట్ వ్యవస్థలో అక్రమ వసూళ్లు, అనధికారిక లావాదేవీలను నివారించడం, రైతుల ఉత్పత్తులకు సరైన తూకం, పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియ, సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రధాన లక్ష్యాలని వివరించారు"డి ఏ ఓ శివప్రసాద్ మరియు రాయికోడ్ మండల వ్యవసాయ అధికారి సారిక పత్తి కొనుగోళ్ల సందర్భంగా డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పత్తి కొనుగోళ్లలో నాణ్యత, తూకం, కొనుగోలు వివరాల నమోదు, రైతులకు చెల్లింపులు వంటి అంశాల్లో సంబంధిత నిబంధనలు పాటించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.ఈయొక్క కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డి ఏ ఓ శివప్రసాద్, డి ఎం ఓ శ్రీకాంత్ , రాయికోడ్–మునిపల్లి మండలాల వ్యవసాయ కమిటీ చైర్మన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, దేవాదాయ శాఖ చైర్మన్ సతీష్ కులకర్ణి ,రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేదార్‌నాథ్ పాటిల్, మండల కాంగ్రెస్ యుత్ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, యూసుఫ్‌పూర్ సర్పంచ్ సంగారెడ్డి, రాయికోడ్ ఏవో సారిక, మునిపల్లి ఏవో అనిత, రాయికోడ్ మండల AEO ఏ ఈ ఓ లు, రాయికోడ్ మరియు మునిపల్లి మండలాల డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.