ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండంలో రెండో రోజు 36 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి కె.రమేష్‌బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుండి 21, వై.సి.పి నుండి 13, జనసేన పార్టీ నుండి 2 నామినేషన్లు అందాయన్నారు. ఇంకొల్లు-1 తెలుగుదేశం పార్టీ నుండి షేక్ మస్తాన్ బాబా, షేక్ షాహీర్, వైసీపీ నుండి షేక్ మస్తాన్‌వలి, షేక్ మస్తాన్‌బాబా, ఇంకొల్లు-2 నుండి తెలుగుదేశం పార్టీ నుండి కందిమళ్ళ బిందు మాధవి, బెల్లం అరుణ, వైసీపీ నుండి కరి కోటేశ్వరమ్మ, ఇంకొల్లు-3 నుండి తెలుగుదేశం పార్టీ నుండి వలేరు కుమారి, వలేరు రూతమ్మ, ఇంకొల్లు-4 తెలుగుదేశం పార్టీ నుండి నంబూరి శ్రీనివాసరావు, భీమవరం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పంది నాగరాజు, దారా సుబ్బారావు, గొల్లా చైతన్య, పూసపాడు నుండి జనసేన పార్టీ తరపున నున్నా వెంకట్రావు, పేరల వెంకటేష్, దుద్దుకూరు నుండి తెలుగుదేశం పార్టీ నుండి మేడికొండ ఉషారాణి, వైసీపీ నుండి గుంటూరు మరియమ్మ, పిల్లి పల్లవి, గుంటూరు రేణుక, ఇడుపులపాడు-1 నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పాగల రామయ్య, బండారు చెన్నయ్య, ఇడుపులపాడు-2 నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంబటి రాజ్యలక్ష్మి, వైసీపీ అభ్యర్థులుగా నిడమానూరి మురళీ కృష్ణ, కోటి శివరాం ప్రసాద్, కొణికి వైసీపీ అభ్యర్థిగా దాసరి వెంకటేశ్వరరావు, గంగవరం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా కరి అవంతి, నాదెండ్ల శ్రీలక్ష్మి, కరి వెంకట లక్ష్మి, కరి నాగేంద్రం, పావులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంజి రేణుకమ్మ, వైసీపీ అభ్యర్థులుగా గుంజి తిరుమల, పావులూరి సముద్రవేణి, దొడ్డి అంజని, నాగండ్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా కోట శ్రీదేవి, గోరంట్ల సుధారాణి, వంకాయలపాడు వైసీపీ అభ్యర్థిగా యర్రం కల్పన నామినేషన్లు దాఖలు చేశారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.