BREAKING
ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి... *మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్* పటాన్‌చెరులో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మసీదుబండలో వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ  నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

కర్నూలు, అక్టోబర్ 22: జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ  నామినేషన్ల ప్రక్రియను  జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించారు.

గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయాల్లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్  లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియపై నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయాల్లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అని పరిశీలించేందుకు వీలుగా జిల్లా పరిషత్ మరియు ఎంపిడిఓ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పారదర్శకంగా జెడ్పీటీసీ, ఎంపీడీఓ నామినేషన్ల స్వీకరణ నిర్వహించడం లో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్‌, కంప్లైంట్  సెల్ ద్వారా ఎన్నికలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూ, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, సంబంధిత సిబ్బందిని ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని, ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.