BREAKING
వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు బస్సు, లారీ మధ్య ఇరుక్కున్న ఆటో.. తృటిలో తప్పిన పెను ప్రమాదం *వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు* కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం

సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ

Select Suryaa Now
సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ

సీతారామపురం మేజర్ న్యూస్  :     సీతారామపురం మండల పరిషత్ ఎన్నికలకు జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ గురువారం కోలాహలంగా జరిగింది. మొదటిరోజు నిరుత్సాహం గా ముగియడంతో, రెండవ రోజు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో కోలాహలంగా పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థి చింతం రెడ్డి లోకేష్ రెడ్డి సింగారెడ్డిపల్లి సెగ్మెంట్ నుంచి తన నామినేషన్ పత్రం అందించారు. ఆయన తల్లి చింతం రెడ్డి పద్మావతి సుబ్బారెడ్డి బసినేనిపల్లి  సెగ్మెంట్ నుంచి నామినేషన్ పత్రం అందించారు. పబ్బులేటిపల్లి సెగ్మెంట్ నుంచి మద్దినేని శ్రీనివాసులు, నెమళ్లదిన్నె  సెగ్మెంట్ నుంచి గాజులపల్లి రామ్మోహన్ రెడ్డి, అందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నెమళ్లదిన్నె సెగ్మెంట్ నుంచి గాజులపల్లి చంద్రారెడ్డి, సీతారామపురం బిట్ 1 నుంచి బోగినేని సులోచనమ్మ , బసినేనిపల్లి   సెగ్మెంట్ నుంచి తమ్మిశెట్టి లక్ష్మీదేవి, తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి చెన్నారెడ్డి మాట్లాడుతూ సీతారామపురం బిట్ 1 సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం 2,వైఎస్ఆర్సిపి 1, జనసేన 2,. సీతారాంపురం బిట్టు2 సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం 2 వైఎస్ఆర్సిపి 3. బసినేనిపల్లి సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం 4 వైఎస్ఆర్సిపి 4. బాలాయపల్లి సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం 4. నెమలిదిని చెప్పండి నుంచి వైఎస్ఆర్సిపి 2 తెలుగుదేశం 3. పబ్బు రెడ్డి పల్లి నుంచి వైఎస్ఆర్సిపి 2 మొత్తం రెండవ రోజు 36 నామినేషన్లు సమర్పించినట్లు ఆయన తెలిపారు.