BREAKING
మంత్రి పాలెం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ టీం వైసీపీ అభ్యర్థుల తరఫున వెంకటేగౌడ ప్రచారం ఆత్మకూరులో ఎంపీటీసీ స్థానాలకు 20 మంది నామినేషన్లు వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు బస్సు, లారీ మధ్య ఇరుక్కున్న ఆటో.. తృటిలో తప్పిన పెను ప్రమాదం *వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు* కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన

Select Suryaa Now
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్  ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను స్టేట్ జనరల్ అబ్జర్వర్ అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న తీరును సమీక్షించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నాగ అనసూయని అడిగి తెలుసుకున్నారు.

నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.