ఆత్మకూరులో ఎంపీటీసీ స్థానాలకు 20 మంది నామినేషన్లు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలో గురువారం ఎంపీటీసీ స్థానాలకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద రిటర్నింగ్ అధికారి డాక్టర్ టి.సోమయ్య కు పదిమంది టిడిపి అభ్యర్థులు 9 మంది వైసీపీ అభ్యర్థులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ల తొలి రోజైన బుధవారం ఐదు మంది నామినేషన్ దాఖలు చేయగా గురువారం 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మురుగళ్ల స్థానం నుండి వైసీపీ అభ్యర్థులుగా కోనేపల్లి సుబ్బారెడ్డి, బొమ్మిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. చెర్లోయడవల్లి నుండి వైసీపీ అభ్యర్థులుగా చేరెడ్డి శ్యామల,చే రెడ్డి పెంచల రెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కరటంపాడు స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థులుగా దావాసుమన్య,పూనుగుంట రేవతి నామినేషన్లు దాఖలు చేశారు. బట్టేపాడు సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థి కట్టా లక్ష్మీదేవి, తెలుగుదేశం అభ్యర్థులు వీరదిమ్మ గీతమ్మ, రాజేశ్వరిలు నామినేషన్లు దాఖలు చేశారు. మహిమలురు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థులుగా సోమ ప్రశాంత లక్ష్మి, మద్దినేని సుగుణ నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ అభ్యర్థులుగా గువ్వల కల్పన, శ్యామనబోయిన వెంకటసుబ్బమ్మలు నామినేషన్లు దాఖలు చేశారు. వాసిలి సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థులుగా సంకే ఆదిలక్ష్మి,ఎస్ శాలిని నామినేషన్లు దాఖలు చేశారు. నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా షేక్ ఖాజావలి నామినేషన్ దాఖలు చేశారు. అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా బొమ్మ తట్టు శాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ దాఖలు చేశారు. పడకండ్ల ఎంపీటీసీ స్థానం నుండి కొల్లి నరసయ్య నాయుడు, దొడ్ల రామకృష్ణ తెలుగుదేశం అభ్యర్థులుగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.రఫీఖాన్, తాసిల్దార్ పి.పద్మజాకుమారి తదితరులు పాల్గొన్నారు.
చెర్లో యడవల్లి YSRCP MPTC అభ్యర్థి చేరెడ్డి పెంచల రెడ్డి
బట్టేపాడు MPTC సెగ్మెంట్ YSRCP MPTC అభ్యర్థి కట్టా లక్ష్మీదేవి
మహిమలూరు MPTC సెగ్మెంట్ టీడీపీ MPTC అభ్యర్థి మద్దినేని సుగుణ
మురగల్ల సెగ్మెంట్ YSRCP MPTC అభ్యర్థి కోనేపల్లి సుబ్బారెడ్డి .
అప్పారావుపాలెం MPTC సెగ్మెంట్ టీడీపీ MPTC అభ్యర్థి బొమ్మితొట్టి షాలిని
వాసిలి YSRCP MPTC అభ్యర్థి శాలినీ సత్తెనపల్లి
బట్టేపాడు MPTC సెగ్మెంట్ టీడీపీ MPTC అభ్యర్థి వీరదిమ్మ గీతమ్మ
కరటంపాడు టీడీపీ MPTC అభ్యర్థి దావా సుమన్య