BREAKING
కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన న్యూజిలాండ్ తెలుగుదేశం బి ఫారం ఇచ్చిన వారికే మద్దత్తు రామగిరి జెడ్పీటీసీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా బైనీని శిరీష నామినేషన్ దాఖలు…

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండల పరిధిలోని సోమయాజులపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి (NH-40)పై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లే రహదారిని దాటుతుండగా తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి 5.30 గంటల మధ్య గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమయాజులపల్లి గ్రామ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా చోటుచేసుకుంది.

మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5.5 అడుగులు ఉండగా, ఛామనచాయ రంగులో ఉన్నట్లు గుర్తించారు. అతని కుడి చేతిపై పచ్చబొట్టు ఉంది. ప్రస్తుతం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

మృతుడిని గుర్తించిన వారు లేదా అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు ఓర్వకల్లు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.