BREAKING
కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన న్యూజిలాండ్ తెలుగుదేశం బి ఫారం ఇచ్చిన వారికే మద్దత్తు రామగిరి జెడ్పీటీసీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా బైనీని శిరీష నామినేషన్ దాఖలు…

నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ..

Select Suryaa Now
నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ..

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్:  నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉడతా మురళి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి తన మిత్ర బృందంతో కలిసి టీడీపీలో చేరినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఉడతా మురళి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులు ఆయనను, ఆయనతో వచ్చిన మిత్ర బృందాన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో నెల్లూరు రూరల్ ప్రాంతంలో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉడతా మురళితో పాటు ఆయన మిత్ర బృందం టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.