*కుష్టు వ్యాధి నివారణకు ఇంటింటి సర్వే.. ప్రజలు సహకరించాలి: డాక్టర్ నరేందర్ రాథోడ్*
సూర్య మంచిర్యాల టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ గురువారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్లతో సమావేశమై ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లాలో సుమారు 8 లక్షల జనాభాకు సంబంధించి 2.12 లక్షల ఇళ్లలో 650 బృందాల ద్వారా సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని వివరించారు.శరీరంపై స్పర్శలేని మచ్చలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్లు రఘుపతి, పద్మ, ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.