BREAKING
బస్సు, లారీ మధ్య ఇరుక్కున్న ఆటో.. తృటిలో తప్పిన పెను ప్రమాదం *వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు* కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన న్యూజిలాండ్

మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ

Select Suryaa Now
మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగముగా అధికార తెలుగుదేశం పార్టీ తరఫున గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేయ డం జరిగింది.ఈమేరకు కురుపాం నియోజకవర్గo శాసనసభ్యులు మరి యు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గరుగుబిల్లి మండల జిల్లా ప్రాదేశిక సభ్యురాలు (జడ్పిటిసి)గా అధిష్టానం సూచనలు మేరకు కారాడ వెంకటమ్మ పేరును ప్రకటించారు.గరుగుబిల్లి మండల జడ్పీటీసీ టికెట్ ను ఎస్ సి మహిళకు కేటాయించారు.ఈనేపథ్యం లో తెలుగుదేశం పార్టీ తరపున మండల పరిధిలోని గొట్టివలస గ్రామానికి చెందిన కారాడ వెంకటమ్మకు మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం కల్పించింది.జడ్పిటిసి సభ్యురాలుగా గొట్టివలస గ్రామానికి చెందిన కారాడ వెంకటమ్మ పేరును మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఉరిటి రామారావు, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి,మర్రాపు పురుషోత్తంనాయుడు,అక్కేన మధుసూదనరావు,అంబటి రాంబాబు తోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి సూచించారు.ఈ మేరకు గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కారాడ వెంకటమ్మ పేరును ఖరారు చేశారు.గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ శుక్రవారం పార్వతీపురం జిల్లా పరిషత్తు కార్యాల యంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని మాజీ మండల పరి షత్ అధ్యక్షులు ఉరిటి రామారావు తెలిపారు.ఇదిలా ఉండగా తనపై నమ్మకం ఉంచి గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి జడ్పిటిసి అభ్యర్థి కారాడ వెంకటమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.