పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా కిలారి అనూష నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ పరిధిలోని పోలవరం శంకరాపురం గ్రామాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుటకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రీటర్నరింగ్ అధికారి టి హనుమంతరావు నామినేషన్ పత్రాలను అందజేశారు. పలువురు టిడిపి నాయకులతో కలసి వెళ్లి నామినేషన్ ను అనూష దాఖలు చేశారు.