దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో(అనంతపురంబ్యూరో, మేజర్న్యూస్ ) : అనంతపురం నగరంలోని పాతూరు శ్రీ సయ్యాదా మాసుమా బీబీ సాహెబ్ దర్గాలో ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
దువా కార్యక్రమం అనంతరం వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, 13వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిలర్ భాషాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
వారు డివిజన్లోని ఇళ్లను సందర్శించి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. నగర అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ముస్లిం మైనారిటీ నాయకులు రమేష్ గౌడ్ నాయకత్వానికి మద్దతు తెలిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలను ఒప్పించడంలో చురుకుగా పాల్గొంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైసీపీ నాయకులు ఏకేఎస్ ఫయాజ్, రిజ్వాన్, ఏడీసీసీ మాజీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, 13వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.