గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ
గుర్ల, సూర్య : గుర్ల జెడ్పీటీసీ తెదేపా అభ్యర్ధిగా చనమల్ల రాధ గురువారం జిల్లాపరిషత్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా ప్రియతమనేత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్-6’ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గ్రామానికి అందుతున్నాయని తెలిపారు.సమగ్ర అభివృద్ధే, సుపరిపాలన లక్ష్యంగా కూటమి నాయకులందరూ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మన గ్రామం, మన ప్రజలు, మన అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, గుర్ల మండలం ఎన్డీయే కూటమి అభ్యర్థి గా పోటీ చేయడం జరుగుతుందన్నారు. మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయంతో మండలంలో సంక్షేమ ఫలాలు మరింత వేగంగా అమలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఆమె తోపాటు మండలపార్టీ అధ్యక్షులు చనమల్ల మహేష్, ఏ ఏం సి ఉపాధ్యకులు దాసరి శివప్రసాద్, మాజీ ఎంపీటీసీ దుర్గాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.