సూర్య,కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భీమ్ ఏజెన్సీ తీరును నిరసిస్తూ విధులను బహిష్కరించి ఆసుపత్రి వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.పండుగ బోనస్, బకాయి జీతాలు చెల్లించడంతోపాటు పీఎఫ్ ఖాతాల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేయాలని కోరారు. నాలుగేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ నియామక ఉత్తర్వుల ప్రతులు, ఈఎస్‌ఐ కార్డులు అందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన చట్టబద్ధమైన ప్రయోజనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.అవుట్‌సోర్సింగ్ సంస్థ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి . పెండింగ్‌లో ఉన్న జీతాలు, బోనస్, పీఎఫ్ వ్యత్యాసాలను తక్షణమే చెల్లించి, ఉద్యోగ నియామక ఉత్తర్వుల ప్రతులు, ఈఎస్‌ఐ కార్డులు అందజేయాలని కార్మికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.