ఇండిపెండెంట్ 48వ వార్డు అభ్యర్థిగా కోయిలాడ నవ్య ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48 వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోయిలాడ నవ్య వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోయిలాడ మురళి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.