BREAKING
రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా! పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు - నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం - ఆయుష్మాన్ ఖురానా 'ఉడతా తీర్' మూవీ రివ్యూ: నవ్వులు పంచడంలో ఈ స్పై కామెడీ మెప్పించిందా? మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!

చెడుపై సాధించిన విజయమే విజయదశమి

Select Suryaa Now
చెడుపై సాధించిన విజయమే విజయదశమి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :విజయానికి చిహ్నంగా జరుపుకునే పండుగ విజయదశమిని, చెడుపై మంచి సాధించిన విజయమే దసరా అని రుయా ఆసుపత్రి మాజీ సూపర్డెంట్ డాక్టర్ భారతి తెలిపారు. రాష్ట్రీయ సేవా సమితి మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో యశోద నగర్ లోని సప్తగిరి నగర్ క్లస్టర్ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి నామస్మరణతో వేద పండితుల మంత్రాలతో సామూహిక దసరా మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై   విజయదశమి పర్వదినాల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో  అమ్మవారిని దర్శించుకొనడం వలన జీవితాలకు మంచి జరుగుతుందని తెలిపారు. సృష్టికి మూలమైన మహిళలు సామూహికంగా వ్రతాలు, పూజలు, కైంకర్యాలు, క్రతువులు చేయడం వల్ల సమ సమాజ అభివృద్ధి చెందుతుందన్నారు. ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చెన్నై మహావీర్ ఫౌండేషన్ ప్రతినిధి సత్యమూర్తి మాట్లాడుతూ రాస్ చేస్తున్న వివిధ సేవ కార్యక్రమాలు మహిళల్లో చైతన్యం కోసం, మహిళా సాధికారత కోసం వీరి కృషి అభినందనీయమన్నారు. రాస్ మహిళా పొదుపు సంఘాల ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.నాగరాజు  మాట్లాడుతూ లింగ వివక్షత లేకుండా పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. సామూహికంగా పూజలు చేయడం వల్ల వారిలో మానసికస్థైర్యం, ఓర్పు, మెర్పు,సహనం, తీర్పు, అంకితభావం వారి కుటుంబాలకు ఉపయోగపడతాయన్నారు. అనంతరం నిరుపేదలకు చేతి కర్రలు, దుప్పట్లు, రెండు చక్రాల సైకిళ్లు, వినికిడి పరికరాలు, బియ్యం, అందించడం జరిగింది.పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలాజీ రెడ్డి, నాగేశ్వర్, వాణి,  పద్మనాభం, శ్రీలతతో పాటు క్లస్టర్ లీడర్లు, జయలక్ష్మి, పావని, రాణమ్మ, 250 మంది మహిళలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్