ఈనెల 25న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేశారు.