ఎంపీ మహేష్ కుమార్ తో ఎమ్మెల్యే బడేటి
చంటి భేటీ ఏలూరు , మేజర్ న్యూస్ :ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోటీ చేయనున్న అభ్యర్థులు, ఆశావహుల అంశాలు, ఎన్నికల నిర్వహణ, పార్టీ నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి పలు విషయాలపై సమాలోచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.