BREAKING
ధర్మ చక్ర పరివర్తన దినోత్సవం విజయవంతం చేయాలి చంద్రధనలో అమ్మవారి ముక్కుపుడక రూ.1,76,001కు వేలం పొదలకూరులో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక కొమరం భీం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన లక్ష్మీ నర్సింహ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పొదలకూరులో పోలీసుల కవాతు దుర్గామాత శోభాయాత్రలో ఘర్షణ ప్రోటోకాల్ ను దిక్కరిస్తున్న ఇందిరమ్మ కమిటీ - రద్దుకు ఎంపిడివోకు వినతి సైదాపురంలో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు -రెండు రోజుల్లో 54 నామినేషన్లు.. టీడీపీ, వైసీపీల మధ్య పోటీ! వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వార్డు నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన కె.కె రాజు కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం - ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం – కాకాణి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఏ ఎస్ పి ఎం వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేయడమైంది భారీ బందోబస్తు మధ్య ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు

కోలాహలంగా నువ్వురుపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా ఖాజావలి నామినేషన్

Select Suryaa Now
కోలాహలంగా నువ్వురుపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా ఖాజావలి నామినేషన్

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :     ఆత్మకూరు మండలం నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానానికి కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం అభ్యర్థి షేక్ ఖాజావలి గురువారం అత్యంత కోలాహలంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల తో ర్యాలీగా వచ్చి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నువ్వురుపాడు సెగ్మెంట్ పరిధిలోని నువ్వురుపాడు, దేపూరు, పాతజంగాలపల్లి, అశ్వినిపురం, ఈ పంచాయతి పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దాదాపు 400 మందితో ఆయన అట్టహాసంగా ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ టి.సోమయ్యకు తన నామినేషన్ను దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన నిర్ణయానుసారం, మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచలచౌదరి తదితరుల ఆధ్వర్యంలో ఖాజావలి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు సిండికేట్ రైతు సేవా సహకార సంఘ మేనేజింగ్ డైరెక్టర్ గతంలో పనిచేసి ఉద్యోగ విరమణ గావించిన ఖాజావలి తెలుగుదేశంలో చురుగ్గా ఉంటూ గ్రామ టిడిపి కమిటీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ మంత్రి రామ నారాయణరెడ్డి నిర్ణయించడంతో ఆయన తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యూనిట్ ఇన్చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి, మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నువ్వురుపాడు గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, మాజీ సర్పంచ్ దేవరపాటి రమణయ్య,గ్రామ తెలుగుదేశం నాయకులు సుదర్శన్ రెడ్డి,దేవరపాటి శ్రీనివాసులు, రామ్మోహన్ రెడ్డి, దేపూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, నువ్వురుపాడు,దేపూరు పంచాయతీలకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఖాజావలి నామినేషన్ కార్యక్రమం అత్యంత కోలాహాలంగా సాగింది.