అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం : ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :
పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యుల కార్యాలయంలో అంతర్జాతీయ వాలీబాల్ లెవెల్ -1 క్రీడాకారుడిని శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు.ఈనెల 7 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇండోనేషియా లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ లెవెల్ -1 శిక్షణా తరగతులకు హాజరై ధృవీకరణ పత్రం పొందడం గర్వకారణమని క్రీడాకారుడు నాగేళ్ల రాజా ను అభినందించారు.తన నియోజకవర్గ క్రీడాకారుల ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేస్తానని ప్రతిఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.
గన్నవరం ఏలియ, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్