BREAKING
రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా! పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు - నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం - ఆయుష్మాన్ ఖురానా 'ఉడతా తీర్' మూవీ రివ్యూ: నవ్వులు పంచడంలో ఈ స్పై కామెడీ మెప్పించిందా? మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!

ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక

Select Suryaa Now
ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక

సూర్య, మాక్లూర్ : మాక్లూర్  మండలం గొట్టుముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఘనంగా నిర్వహించారు. 2000-01 బ్యాచ్ విద్యార్థులు.. తాము పదో తరగతి ముగించుకొని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు (రజతోత్సవం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు మనోహర స్వామి, ఉపాధ్యాయులు సుదర్శన్, పుష్ప, రమేశ్ తో పాటు శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు వెంకటరమణ, ఉపాధ్యాయులు అల్లారి భోజన్న, హర్షవర్ధన్, ప్రకాశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులను, కుంటుంబ నేపథ్యాన్ని సభలో పంచుకున్నారు. తమ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెచ్ఎం మనోహర స్వామి మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేని విద్యార్థులు ఇప్పుడు తమ పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు వెంకటరమణ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం తాను ప్రైవేటుగా నడిపిన స్కూలులో ఓనమాలు దిద్దిన విద్యార్థులు తనను, తమ స్కూల్ సిబ్బందిని గుర్తు పెట్టుకొని మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనందంగా ఉందని చెప్పారు. తన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న పూర్వ విద్యార్థుల పిల్లలు ఎవరైనా చదువులో ప్రతిభ కనబరుస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు.  మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ.. జీవన ప్రయాణంలో ఎందరో ఎక్కడెక్కడికో చేరుకుంటారని తెలిపారు. తోటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, తాము మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నామన్న భావన ఎప్పటికీ రానీయవద్దని చెప్పారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఇందులో సంజీవ్,నరేష్,అంజి,తదితరులు పాల్గొన్నారు.