BREAKING
రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా! పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు - నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం - ఆయుష్మాన్ ఖురానా 'ఉడతా తీర్' మూవీ రివ్యూ: నవ్వులు పంచడంలో ఈ స్పై కామెడీ మెప్పించిందా? మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!

ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు

Select Suryaa Now
ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:జిల్లా కేంద్రంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను అత్యంత  ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకల్లో భాగంగా ద్వారకానగర్ రోడ్ లోని పండుగ సాయన్న విగ్రహానికి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష ముఖ్య అతిథులుగా హాజరై నివాళులు అర్పించి స్మరించుకున్నరు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం మేరకు పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రతి జిల్లాలో అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. . జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్, ఫౌండేషన్ కోర్సులకు దాదాపు 200 మందికి పైగా యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్యకార సంఘాల నాయకులు లేవనెత్తిన స్థలాలు, షెడ్లు, మత్స్యకార సొసైటీల సమస్యలు, చెరువులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలను సంబంధిత డిపార్ట్‌మెంట్ల వారీగా సమీక్షించి, డీఎస్సీడీఓ సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. 
ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, చరిత్రలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడిన గొప్ప నేత పండుగ సాయన్న అని కొనియాడారు.  సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ఆయనను అధికారికంగా గుర్తించడం ఎంతో సంతోషకరమని ఎంపీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి బిసి సంక్షేమ అధికారి సునీత కుమారి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు, రవి, బిసి సంఘాల ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.