అనుమతి లేనిదే బోరు వేస్తే చర్యలు తప్పవు : తహశీల్దార్ శ్రీనివాస్
కృష్ణ సూర్య న్యూస్ :
మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు క్షీణిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ అనుమతి లేకుండా బోరు బావులు తవ్వితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మండల తహశీల్దార్ శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక ఆదేశాల మేరకు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ను బోరు డ్రిల్లింగ్ చేసుకోవాలన్నవారు అనుమతి తప్పనిసరి పొందాల్సి ఉంటుందని తహశీల్దార్ తెలిపారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ
ప్రస్తుతం ఏర్పడిన 'ఎల్ నినో' ప్రభావం వల్ల మండలంలో వర్షపాతం దారుణంగా తగ్గిందన్నారు. దీని మూలంగా భూగర్భ జలమట్టాలు పడిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కూడా అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి బోరు బావులు తవ్వకూడదు" అని సూచించారు.
తాగునీటి అవసరాల కోసం బోరు వేయాలనుకునే వారు ముందుగా సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలోనూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ద్వారా నారాయణపేట భూగర్భ జల వనరుల శాఖ అధికారి ఆర్జీ కి ,అనంతరం
ఆయా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, ఆమోదం తర్వాత మాత్రమే బోరు వేసుకోవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ పంటల సాగు కోసం కొత్తగా బోరు బావులు తవ్వడానికి కూడా అనుమతి తప్పనిసరి పొందాలని తెలిపారు.
మండలంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, ఎవరైనా అక్రమంగా బోర్లు వేస్తే చట్టపరమైన చర్యలతో పాటు బోరింగ్ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.
కాబట్టి మండల రైతన్నలు, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం