BREAKING
బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా!

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు - కలెక్టర్ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు మెరుగైన ధర పొందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన పత్తి కొనుగోలు ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి తేమ శాతం పరీక్ష, తూకం ప్రక్రియను పరిశీలించి రైతులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 కాగా, జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతం రూ.9,260 వరకు ధర చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌లో అత్యధిక ధర లభించడం రైతులకు ప్రయోజనకరమైన విషయమన్నారు.పత్తిలో తేమ శాతం అధికంగా ఉండకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావడం ద్వారా నాణ్యతను కాపాడుకోవడంతో పాటు మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో తేమ శాతం పరీక్షించే యంత్రాల వినియోగంపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని యంత్రాల ద్వారా పారదర్శకంగా పరీక్షించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.రైతుల సౌకర్యార్థం మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు వేచి ఉండే సమయం తగ్గేలా తూకం, తేమ పరీక్ష, కొనుగోలు తదితర ప్రక్రియలను సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ‘రూపాయికే భోజనం’ పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతు ప్రతినిధులతో స్థానిక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంట వ్యర్థాలను కాల్చవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు దెబ్బతినడంతో పాటు భూసారం, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందన్నారు. పంట అవశేషాలను భూమిలోనే కలిపి సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పంట వ్యర్థాలను పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం ద్వారా పశువులకు మేత కొరతను నివారించవచ్చన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో పత్తికి క్వింటాల్‌కు రూ.9,260 వరకు ధర లభించడం రైతులకు శుభపరిణామమన్నారు.  జమ్మికుంటలో రూ.9,250, వరంగల్‌లో రూ.9,110 ధరలు నమోదయ్యాయని తెలిపారు. పత్తి వాహనాలు రాంపూర్, బైపాస్ మార్గం మీదుగా మార్కెట్‌యార్డుకు చేరుకోవాలని, తూకం పూర్తయిన వెంటనే పట్టీ తీసుకోవాలని రైతులకు సూచించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, పత్తికి రూ.9,260 వరకు ధర లభించడం రైతులకు సంతోషకరమైన విషయమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలను కాపాడుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతు సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.