రేపటి నుంచి డిగ్రీ తుదివిడత ప్రవేశాలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో యూజీ ప్రవేశాలకు సంబంధించి రెండవ విడత పూరై సుమారు 25 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మిగిలిన సీట్ల భర్తీ కోసం తుదివిడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. శనివారం నుంచి 26వ తేదీవరకు విద్యార్థులు తుదివిడత ప్రవేశాల కోసం ఓఏఎల్డీసీ వెబ్సైట్లో ధరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. 25వ తేదీ నుంచి 27వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 26, 27వ తేదీలలో వెబ్ ఆప్షన్లు, 28న అప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందని, 30వ తేదీన సీట్ల కేటాయిస్తారని తెలియజేశారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 2వ తేదీలోపు రిపోర్టు చేసి ప్రవేశాలు పొందాలని వెల్లడించారు.
సీఎంగౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్