BREAKING
అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం : ఎమ్మెల్యే కన్నా మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క 34వ వార్డులో కీర్తి జావిద్ ముమ్మర ప్రచారం కాకినాడ జిజిహెచ్ లో గుండె వైద్యం గల్లంతు! నామినేషన్ కేంద్రం దెగ్గర గుంపులు గుంపులుగా ఉండడం నిషేధం.. జగ్గయ్యపేట సీఐ... నిరుపేద విద్యార్థి చదువుకు ఆరా ఇగ్నైట్స్ చారిటబుల్ ట్రస్ట్ భరోసా. కడప జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్నచోట్ల ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాలి కన్నెవీడు ఎంపీటీసీ అభ్యర్థిగా బాణావత్ బుజ్జిబాబు నామినేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి: ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్! హకింపేట్ ఎడ్యుకేషన్ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య బీసీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి -- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రీవ తీర్మానం.. విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్ భూ రీ-సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆత్మకూరులో పూర్తిస్థాయి బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ -- ఎస్సై జంపానీ కుమార్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తీవ్ర అస్వస్థత:

చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు

Select Suryaa Now
చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట సర్య  న్యూస్ 

పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు,నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు.హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను అతిథులు పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ హాస్పిటల్ వ్యవస్థాపకులు పూసల వెంకట నారాయణ,డాక్టర్ నార్నె కృష్ణ గీత పూసల చేస్తున్న కృషిని అభినందించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ,వారి నమ్మకాన్ని పొందాలని ఆకాంక్షించారు.నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.తమ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రత్తిపాటి పుల్లారావుకు హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది.అనంతరం ఆయనను ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం,వైద్యులు,ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట సూర్య ఆర్సి ఇంచార్జ్