BREAKING
భారీ బందోబస్తు మధ్య ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు *కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా... *ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు తె ర్లాం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా ఎన్ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు హడలెత్తిస్తున్న గ్రామసింహాలు - భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి... గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు బీజేపీ పాదయాత్ర.. రేపు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే సహకారంతో ఐదు లక్షల ఎల్ ఓ సి చెక్కు అందజేత

కడప జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్నచోట్ల ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాలి

Select Suryaa Now
కడప జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్నచోట్ల ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాలి

పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు దాఖలు చేయాలి: 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులకు అండగా ఉంటాం 

 కడప పార్లమెంట్ నిర్వహణ దళ సభ్యుడు శివ గోవిందుగారి

 కడప, ప్రతినిధి, వేణు.

కడప జిల్లాలో  స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహ అభ్యర్థులందరూ తప్పనిసరిగా నామినేషన్లు దాఖలు చేయాలని కడప పార్లమెంట్ నిర్వహణ దళ సభ్యుడు శివ గోవిందుగారి గురువారం పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీకి ప్రజాదరణ, గెలుపు అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ముందుకు రావాలని సూచించారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో ఆశావహ అభ్యర్థులకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల ద్వారా అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శివ గోవిందుగారి తెలిపారు.

మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేము మీకు అండగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసే ప్రతి జనసైనికుడికి ప్రోత్సాహం అందిస్తూ, స్థానిక సంస్థల్లో జనసేన బలాన్ని పెంచేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదాం” అని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.