హకింపేట్ ఎడ్యుకేషన్ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
దుద్యాల్, మేజర్ న్యూస్ : మండల పరిధిలోని హకింపేట్ గ్రామ శివారులో ఏర్పాటు అవుతున్న ఎడ్యుకేషన్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే చేశాడు. కొడంగల్ నివాసంలో కార్యకర్తలకు దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం తక్కువ ఉండడంతో హకింపేటలో పర్యటించేంత అవకాశం లేకపోవడంతో హెలికాప్టర్ లో నుండి ఏరియల్ సర్వే చేపట్టాడు. పనుల పురోగతిని గురించి తన తనతో పాటు ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు అనుకున్న గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని సంబంధిత అధికారులకు సూచించాడు. నిత్యం పనుల పురోగతిని పై అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించాడు. ఎడ్యుకేషన్ హబ్ చుట్టూ మూడు రౌండ్లు తిరుగుతూ... పనుల ను పరిశీలించాడు. అక్కడ నుంచి నేరుగా కోడంగల్ కు చేరుకున్నాడు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.